పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన కార్యక్రమం

NRPT: పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో జీపీయస్ ఊట్కూర్ పాఠశాలలో ధ్యానంపై అవగాహన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ సొసైటీ సభ్యురాలు సుజాత విద్యార్థులకు ధ్యానం యొక్క ప్రాముఖ్యత, ధ్యానం ద్వారా కలిగే మానసిక శాంతి, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం గురించి వివరించారు. అనంతరం విద్యార్థులు ఆమె సూచనలతో ధ్యానంలో నిమగ్నమయ్యారు.