సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

KDP: కడప నగరంలో అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మాధవి రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోని 12వ డివిజన్ పకీరు పల్లెలో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. నాణ్యతతో కూడిన పనులను చేయాలని కాంట్రాక్టర్‌ను, ఎమ్మెల్యే ఆదేశించారు. అన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు, విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలన్నారు.