‘నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలి’
చిత్తూరులో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను కమిషనర్ నరసింహ ప్రసాద్ ఇవాళ ఉదయం తనిఖీ చేశారు. గిరింపేట, పాత కలెక్టరేట్ రోడ్డు, కలెక్టరేట్ రోడ్డు, ఇరువారం, కాజూరు సర్కిల్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. రహదారులు, రోడ్లు ఇరువైపులా శుభ్రంగా ఉండాలని, ప్రతి ఇంటి నుంచి తడి, పొడి వ్యర్థాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.