దూప్ సింగ్ తండాలో పర్యటించిన కవిత
MDK: హవేలి ఘనపూర్ మండలం ధూప్ సింగ్ తండాలో తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత పర్యటించారు. రెండో రోజు జిల్లా పర్యటనలో భాగంగా జాగృతి జనం బాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తండాలో వరద బాధితులను పరామర్శించి, దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ పనుల ఆలస్యంపై ఆమె ఆరా తీశారు. ఇందులో భాగంగా పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.