మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానం
నఅంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కనిగిరి పోలీస్ స్టేషన్‌లో సేవలందిస్తున్న మహిళా హోమ్ గార్డ్, స్వీపర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కనిగిరి సీఐ శ్రీనివాసరావు శాలువా కప్పి వారికి బహుమతులు అందజేశారు. మహిళల సేవలను అభినందిస్తూ వారి కృషిని కొనియాడారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.