15న కొండబిట్రగుంటకు రానున్న సింగర్ సత్యయామిని

నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నవిషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 15 గ్రాండ్ గా మ్యూజికల్ నైట్ను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సింగర్ సత్య యామిని సందడి చేయనున్నారు. ఆవిడతోపాటూ జబర్దస్త్ నటీనటులు కూడా ఈ కార్యక్రమంలో ప్రదర్శనలు ఇవ్వనున్నారు.