ఫిఫా ప్రపంచకప్-2026 షెడ్యూల్ విడుదల
ఫిఫా ప్రపంచకప్-2026 షెడ్యూల్ విడుదలైంది. జూన్ 11 నుంచి జూలై 19 వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. కెనడా, మెక్సికో, అమెరికా వేదికగా ఈ సాకర్ మ్యాచ్‌లు జరగనున్నట్లు ఫిఫా వెల్లడించింది. ఈ దేశాల్లోని 16 వేదికల్లో 104 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. ఫిఫా వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు 32 దేశాలే పాల్గొంటుండగా.. ఈ సారి 48 దేశాలు బరిలో నిలవనున్నాయి.