యువకుల మధ్య ఘర్షణ ... యువకుడు మృతి

WGL: గుండా బ్రహ్మయ్య జాతర చూసేందుకు వెళ్లిన యువకుడు అక్కడ జరిగిన ఘర్షణలో మృతి చెందారు. దీనికి సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి. సంగెం మండలం గవిచర్లలో ఆదివారం రాత్రి జాతరలో ప్రభ బండ్లు తిరుగుతున్న క్రమంలో కుంటపల్లి, సంగెం గ్రామాలకు చెందిన యువకుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో చిన్న.బన్ని (21) యువకుడికి బలమైన గాయాలై మృతి చెందాడు.