BREAKING: రాజకీయాల్లోకి నితీశ్ వారసుడు
బీహార్ రాజకీయాల్లో సంచలనం రేపుతూ CM నితీశ్ కుమార్ తనయుడు నిషాంత్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి శ్రవణ్ కుమార్ వెల్లడించారు. నిషాంత్‌కు JDUలో కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందని, త్వరలో దీనిపై పార్టీ అధికారిక ప్రకటన చేయనుందని తెలిపారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని చెప్పే నీతీష్, తన కుమారుడిని రంగంలోకి దించడం హాట్ టాపిక్‌గా మారింది.