'నాడు సతులు... నేడు పతులు'
MHBD: గత పాలకవర్గంలో 16వార్డుల్లో పలువురు సతులు వార్డు కౌన్సిలర్లుగా పనిచేశారు. వారి స్థానంలో ప్రస్తుతం పతులు విజయం సాధించారు. గత తొర్రూరు మున్సిపల్ ఎన్నికల్లో తూర్పాటి సంగీత, పేర్ల యమున, కర్నే నాగజ్యోతి గెలిచారు. ఈ ఎన్నికలలో వారి భర్తలు తూర్పాటి రవి, పేర్ల జంపా, కర్నె నాగరాజు గెలుపొందారు.