స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ఠ భద్రత ఉండాలి: కలెక్టర్
GDWL: ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత పటిష్ఠంగా ఉండాలని కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ ఆవరణలోని ఈవీఎం గోదాంలను మంగళవారం సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్ నిర్వాణకు సంబంధించిన రికార్డులు, సీసీ కెమెరాలు పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.