రైతు బీమా చెక్కు అందజేత
GDWL: గట్టు మండలం చాగదొన గ్రామానికి చెందిన తెలుగు మారెప్ప నెల రోజుల క్రితం మృతి చెందగా, ఆయన కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 'రైతు బీమా' చెక్కును మాజీ ఎంపీపీ జె. విజయ్ కుమార్ సోమవారం అందించారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మారెప్ప సోదరుడు నరసింహులకు రూ.5 లక్షల చెక్కును అందజేశారు.