రోడ్డు ప్రమాదాలకు నివారణకు ప్రత్యేక తనిఖీలు
కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణాను అడ్డగింపు,అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడమే లక్ష్యంగా పోలీసులు శనివారం ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల సందర్భంగా వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సి (RC), పొల్యూషన్, ఇన్షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై చలాన్లు విధించారు.