VIDEO: సొసైటీ ఆధ్వర్యంలో మక్కలు కొనుగోలు
SRD: సిర్గాపూర్ మండలంలోని బొక్కస్ గాం PACS ఆధ్వర్యంలో మొక్కజొన్న పంట (మేజ్) కొనుగోలు జోరుగా కొనసాగుతోంది. అయితే అంతర్గాం గ్రామంలో మార్కెట్ గోదాం వద్ద మక్కల కాంట చేపడుతున్నారు. ఇప్పటివరకు 89 మంది రైతుల నుంచి, 10,410 బస్తాలు(6045 క్వింటాళ్లు ) కొనుగోలు చేసినట్లు సీఈవో సతీష్ తెలిపారు. మక్కల తేమ శాతాన్ని పరిశీలించి కొనుగోలు చేస్తున్నామన్నారు.