మత్స్యకారులకు అండగా కూటమి ప్రభుత్వం: ఎంపీ
NLR: మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. తమిళనాడు వాళ్లు తీసుకెళ్లిన 4 బోట్లను సీఎం చంద్రబాబు చొరవతో వెనక్కి తెప్పించామన్నారు. త్వరలో తిరుపతి, నెల్లూరు, బాపట్లకు కొత్త బోట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు వేటపై నిషేధం ఉంటుందని తెలిపారు.