పోలీసులను సన్మానించిన గ్రామ పెద్దలు

పోలీసులను సన్మానించిన గ్రామ పెద్దలు

VZM: వేపాడ మండలం బొద్ధాంలోని జనపరెడ్డి వెంకటరమణ ఇంటిలో దొంగతనం జరిగిన కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పోలీసులు తనదైన శైలిలో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకొన్నారు. ఈ సందర్బంగా గ్రామ పెద్దలు, ప్రజా ప్రతినిధులు ఎస్.కోట గ్రామీణ సీఐ అప్పలనాయుడు, ఎస్సై సుదర్శన్, సిబ్బందిని బుధవారం ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. విలువైన వస్తువులను బ్యాంకులలో భద్రపరచుకోవాలన్నారు.