క్రిమినల్ కావాలనే సహస్ర మర్డర్

HYD: కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో విచారణ వేగం పుంజుకుంటోంది. నిందితుడైన బాలుడిపై SC, ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులు యోచిస్తున్నట్లు సమాచారం. క్రిమినల్ కావాలనే లక్ష్యంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టిన్నట్లు దర్యాప్తులో బయటపడింది. బాలుడి ఫోన్లో క్రైమ్ సిరీస్ ఎపిసోడ్‌లు అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.