పంది కడుపులో ఏనుగు పిల్ల..!

పంది కడుపులో ఏనుగు పిల్ల..!

NGKL: పెద్దకొత్తపల్లి మండలంలో వింత సంఘటన చోటు చేసుకుంది. పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన కురాకుల వెంకటయ్య అనే పందుల పెంపకందారుడికి చెందిన ఓ పందికి ఏడు పిల్లలు జన్మించాయి. వాటిలో ఒకటి అచ్చం ఏనుగు పిల్ల ఆకారంలో జన్మించింది. ఈ వింత సంఘటనతో బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన విషయం నిజమైందని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. ఈ వింతను చూసేందుకు గ్రామస్థులు భారీగా తరలివస్తున్నారు.