ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలి: ఎంపీ

ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలి: ఎంపీ

MBNR: అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఎంపీ డీకే అరుణ ఆకాంక్షించారు. ఆదివారం పట్టణంలోని బంగారు మైసమ్మ ఆలయాన్ని ఆమె దర్శించుకున్నారు. మైసమ్మ అమ్మవారికి పుష్పాలు సమర్పించి కుంకుమార్చన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. భగవంతుని ఆశీస్సులతో, ప్రజల సహకారంతో పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్నిరంగాలలో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానని వెల్లడించారు.