అలా చేసి ఉంటే గొప్ప కోచ్ అయ్యేవాడు: పఠాన్

భారత కల్చర్‌ను, సీనియర్ ఆటగాళ్లను గౌరవించి ఉంటే టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ గొప్ప కోచ్ అయ్యేవారని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఛాపెల్ ఒంటెద్దు పోకడలతో వ్యవహరించి సీనియర్ ఆటగాళ్లను ఏమాత్రం పట్టించుకోలేదని పఠాన్ విమర్శించాడు. ఆయన హయాంలో టీమిండియా గడ్డు పరిస్థితులను ఎదుర్కొందని అన్నాడు. ఒక కోచ్‌గా ఛాపెల్ టీమిండియాకు చెడ్డపేరు తెచ్చారని ఆరోపించాడు.