VIDEO: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అ. కలెక్టర్
BHPL: పలిమెల మండల కేంద్రంలోని నామినేషన్ కేంద్రాలను మంగళవారం అదనపు కలెక్టర్ విజయలక్ష్మి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వార్డు సభ్యుల నామినేషన్లలో ప్రతిపాదకులు అదే వార్డుకు చెందిన ఓటర్లే కావాలని, నిబంధనలు కచ్చితంగా పాటించాలని సిబ్బందికి ఆదేశించారు. చివరి రోజు కావడంతో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.