ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

NLG: ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల డాక్టర్లు వారి పరిధిలోని పాఠశాలలు, హాస్టళ్లను రెగ్యులర్‌గా సందర్శించి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఈరోజు హాలియా 30 పడకల ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నూతన ఆసుపత్రి భవన నిర్మాణం పనులు పరిశీలించారు.