దేవరపల్లి ఆశ్రమ విద్యార్థలకు ఎమ్మెల్యే పరామర్శ
ASR: కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురై రంపచోడవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 71 మంది విద్యార్థులను ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పరామర్శించారు. వారికి మనోధైర్యాన్ని చెబుతూ, మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. పర్యవేక్షణ లోపం వల్లే ఇది జరిగిందని, బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.