VIDEO: గ్రామచెరువుకు గండి.. నీట మునిగిన పంట పొలాలు

మహబూబ్‌నగర్ మండలం ఫతేపూర్ గ్రామ చెరువుకు మంగళవారం గండి పడింది. ఆ కారణంగా వరద నీరు పెద్ద ఎత్తున ఆయకట్టు పంట పొలాల్లోకి వెళ్లడంతో పంట నీట మునిగింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా ఎడితెరపి లేకుండా భారీ వర్షం కురుస్తుండడంతో చెరువు పూర్తిస్థాయిలో నిండుకుంది.