'చిత్తారు శ్రీహరి యాదవ్ సేవలు మరువలేనివి'
KMM: బీసీ నేత చిత్తారు శ్రీహరి యాదవ్ బీసీ, ఎస్సీ, ఎస్టీలతోపాటు యాదవులకు చేసిన సేవలు మరువలేనివని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మేకల మల్లి బాబు యాదవ్ అన్నారు. ఆదివారం చింతకాని(M) అష్టగుర్తిలో శ్రీహరి యాదవ్ 14వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ప్రజలకు ఆపద వచ్చి కబురు వస్తే క్షణం పాటు కూడా ఆలోచించకుండా సమస్యను పరిష్కరించే వారని పేర్కొన్నారు.