VIDEO: అన్నను హత్య చేసిన తమ్ముడు
HYD: మియాపూర్‌లోని ఆగయ్య నగర్ కాలనీలో దారుణ హత్య జరిగింది. మద్యం మత్తులో తమ్ముడు తన అన్నను బండరాయితో మోది, కత్తితో పొడిచి చంపాడు. అన్న తరచూ తాగి గొడవ చేస్తూ వేధిస్తుండటమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.