స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టిన కారు.. తప్పిన పెను ప్రమాదం

SKLM: నరసన్నపేట మండలం జమ్ము జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ వ్యాన్ కారుని ఢీకొట్టడంతో పలువురు విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. సబ్ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్ సకకాలంలో స్పందించడంతో హెడ్ కానిస్టేబుల్ దాల్ నాయుడు సహాయంతో విద్యార్థుల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.