టిప్పర్ ఢీకొని ఇద్దరికి గాయాలు
GNTR: మంగళగిరి పరిధి కురగల్లులో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్ లారీ ఢీ కొనడంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. లారీని గ్రామస్థులు అడ్డుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. గతంలో ఇదే ప్రాంతంతో లారీ కిందపడి వ్యక్తి మరణించిన విషయం తెలిసిందే.