VIDEO: తిరుమల పాదయాత్రపై ఆంక్షలు బాధాకరం
అన్నమయ్య: తిరుమల మహా పాదయాత్రపై అటవీ, పోలీసు శాఖలు విధించిన ఆంక్షలు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 22 ఏళ్లుగా వేలాది మంది అన్నమయ్య నడిచిన కాలిబాటలో పాదయాత్రగా తిరుమలకు వెళ్తున్నప్పటికీ ఎప్పుడూ ఆంక్షలు లేవని, ఇప్పుడు మాత్రమే అవరోధాలు పెట్టడం అర్థంలేనిదని విమర్శించారు.