క్రీడలతో ప్రత్యేక గుర్తింపు: ఎమ్మెల్యే

PDL: క్రీడలతో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. జిల్లా క్రీడాశాఖ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యార్థులు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను వినియోగించుకోవాలని సూచించారు.