నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం: ఈఈ
AKP: కశింకోట మండలంలో పలు గ్రామాలకు ఇవాళ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ మురళీకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. చెట్ల కొమ్మలు తొలగిస్తున్న కారణంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు బయ్యవరం, కసింకోట, తేగాడ, వెదురుపర్తి గ్రామాలకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు తెలిపారు. వినియోగదారులు అధికారులకు సహకరించాలని కోరారు.