కలెక్టరేట్లో బసవేశ్వర జయంతి
వరంగల్ కలెక్టరేట్‌లో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కలెక్టర్ సత్య శారద బసవన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కులరహిత సమాజం కోసం బసవేశ్వరుడు చేసిన కృషి ఆదర్శనీయమని, ఆయన బోధనలు నేటికీ మార్గదర్శకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని అంజలి ఘటించారు.