ఇస్రోలో శిక్షణకు విద్యార్థిని ఎంపిక

ఇస్రోలో శిక్షణకు విద్యార్థిని ఎంపిక

KMR: కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని నిహారిక అరుదైన గౌరవం దక్కించుకుంది. ఇస్రో (ISRO) నిర్వహించే ప్రతిష్టాత్మక యువికా (YUVIKA) యంగ్ సైంటిస్ట్ కార్యక్రమానికి ఆమె ఎంపికైనట్లు ఉపాధ్యాయుడు ప్రవీణ్ తెలిపారు. కాగా, వీరికి ఇస్రో శిక్షణ కేంద్రాల్లో అంతరిక్ష విజ్ఞానం, ఉపగ్రహాల తయారీ, రాకెట్ టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.