హోటళ్లపై సివిల్ సప్లయ్ అధికారుల దాడులు
KNR: శంకరపట్నం మండల కేంద్రంలోని పలు హోటళ్లు, టీ పాయింట్లపై ఇవాళ పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తున్న 11 గ్యాస్ సిలిండర్లను అధికారులు సీజ్ చేశారు. దాడుల నివేదిక జిల్లా ఉన్నతాధికారలకు సమర్పిస్తామని వెల్లడించారు. ఈ దాడల్లో సివిల్ సప్లయ్ అధికారలు ఖాజా మొయినుద్దీన్, అన్వర్ ఉల్లా ఖాన్ పాల్గొన్నారు.