చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎంపీ
కోనసీమ: టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అమలాపురం రూరల్ మండలంలోని రోళ్లపాలెం గ్రామంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేక్‌ను కటింగ్ చేసి అభిమానులకు పంచి సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు.