ఆలయ అభివృద్ధికి అంబానీ రూ. 5 కోట్ల విరాళం
ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ కేరళలోని ప్రసిద్ధ గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం పూర్తి చేసుకున్న అనంతరం అంబానీ ఆలయ అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.5 కోట్ల విరాళాన్ని ఆలయ అధికారులకు అందించారు.