ఈనెల 26న పశు వైద్య శిబిరం
VZM: కొత్తవలస వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 26న లక్కవరపుకోట మండలం కళ్లేపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి కె.విజయబాబు మంగళవారం తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం మార్కెట్ కమిటీ ఛైర్మన్ అధ్యక్షతన జరుగుతుందని పేర్కొన్నారు.