'మిల్లర్లు ఇబ్బందులు పెడితే ఉపేక్షించేది లేదు'

'మిల్లర్లు ఇబ్బందులు పెడితే ఉపేక్షించేది లేదు'

PPM: ధాన్యం కొనుగోలులో రైతులను మిల్లర్లు ఇబ్బందులు పెడితే ఉపేక్షించేది లేదని సంయుక్త కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం పార్వతీపురం, గరుగుబిల్లి, జీయ్యమ్మ వలస, కురుపాం మండలాల్లోని పలు గ్రామాలను జేసీ సందర్శించి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా పార్వతీపురం మండలం కోటవానివలసలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ముందుగా సందర్శించారు.