సౌత్ జోన్ క్రికెట్ పోటీలకు ఎంపికైన తణుకు విద్యార్థులు

సౌత్ జోన్ క్రికెట్ పోటీలకు ఎంపికైన తణుకు విద్యార్థులు

W.G: ఈనెల 3న భీమవరంలో జరిగిన ఆదికవి నన్నయ యూనివర్శిటీ మహిళల క్రికెట్‌ ఎంపికల్లో తణుకు ఎస్‌కేఎస్‌డీ మహిళా కళాశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. బి.రేవతి, ఎం.మౌనికలు ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపాల్‌ యు.లక్ష్మిసుందరిబాయ్‌ తెలిపారు. ఈనెల 12 నుంచి 16 వరకు యూనివర్శిటీ తరపున తమిళనాడులో జరిగే సౌత్‌జోన్‌ క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని చెప్పారు.