నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: సరుబుజ్జిలి సబ్ స్టేషన్ పరిధిలో 11 కేవీ రొట్టవలస ఫీడర్‌లో చెట్ల కొమ్మలు తొలగించట, విద్యుత్ లైన్ల నిర్వహణ వలన శుక్రవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ తెలిపారు. కొత్తకోట, రొట్టవలస, రావివలస, పెద్దపాలెం, పురుషోత్తపురం, అలమజీపేట, చవ్వాకులపేట, వెన్నెలవలస గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అన్నారు.