తణుకు ఏఎంసీ ఛైర్మన్‌కు అభినందనలు

W.G: తణుకు మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా నియమితులై, ఇటీవల ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన కొండేటి శివను పలువురు కూటమి నాయకులు అభినందించారు. మంగళవారం అత్తిలి మండలం మంచిలి గ్రామ టీడీపీ నాయకులు, అత్తిలి లయన్స్ క్లబ్ నాయకులు శిరగాని నాగు (భగవాన్ నాగు) తణుకు కార్యాలయంలో ఆయనను కలిసి అభినందనలు తెలిపారు.