'సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలి'

KMR: బాన్సువాడ పట్టణంలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సబ్ కలెక్టర్ కిరణ్మయి మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజుకు వినతిపత్రం అందజేశారు. మున్సిపల్ అధికారులు సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించాలని కోరారు. సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.