గోపాల్రావుపేటలో భక్తిశ్రద్ధలతో పంచాంగ శ్రవణం

గోపాల్రావుపేటలో భక్తిశ్రద్ధలతో పంచాంగ శ్రవణం

జగిత్యాల అర్బన్ మండలం గోపాల్రావుపేట గ్రామంలోని శ్రీ శివ పంచాయతన సహిత ఆంజనేయ స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రముఖ సిద్ధాంతులు నంబి వేణుగోపాలచార్యులు, విశ్వనాథ శర్మ, వాసుదేవా చార్యులు భక్తులకు రాశిఫలాలను వివరించారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యా సాగర్ రావు, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్ దావ వసంత పాల్గొన్నారు.