'ఆలయాల వద్ద హద్దు మీరితే చర్యలు తప్పవు'
కోనసీమ: పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ సంస్థానం ఆలయం వద్ద ఆటో, కారు డ్రైవర్లు హద్దు మీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని పిఠాపురం సీఐ జీ. శ్రీనివాస్ హెచ్చరించారు. సోమవారం రాత్రి పట్టణ ఎస్సై వీ. మణికుమార్, సిబ్బందితో కలిసి ఆలయ ప్రాంగణంలో డ్రైవర్లకు చట్టంపై అవగాహన కల్పించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, సమస్యలుంటే తెలియజేయాలన్నారు.