కల్వకుర్తిలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

కల్వకుర్తిలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్

NGKL: హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో బంద్ కార్యక్రమాన్ని చేపట్టారు. బంగ్లాదేశ్‌లో మన హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ హిందువులకు మద్దతుగా హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఐక్యవేదిక కమిటీ వెల్లడించింది. స్వచ్ఛందంగా అన్ని వ్యాపార సంస్థలు, హోటల్స్ షాపింగ్ మాల్స్ బంద్ పాటించారు.