రేపు ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు

MNCL: ఈనెల 9,10 తేదీల్లో రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ రాజు గురువారం ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా నుంచి 20 జట్లు పాల్గొంటాయని, విజేతలకు ప్రథమ బహుమతి రూ.20 వేలు, ద్వితీయ బహుమతి రూ.10వేలు, తృతీయ బహుమతి రూ.5వేలతో పాటు ట్రోఫీలను అందజేస్తామన్నారు.