ప్రభుత్వ కార్యాలయంలో పార్టీ.. లైన్‌మెన్ సస్పెండ్
JGL: పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయంలో శనివారం ముగ్గురు అసిస్టెంట్ లైన్‌మెన్లు మద్యం పార్టీ చేసుకున్న విషయం తెలిసిందే. ఇది కాస్త SMలో వైరల్ కావడంతో విద్యుత్ శాఖ సీఎండీ వాకాటి వరుణ్‌రెడ్డి తీవ్రంగా పరిగణించారు. దీంతో అసిస్టెంట్ లైన్ మెన్లు ఎం.ప్రభాకర్, జి.బాలకృష్ణ, వి.రాజశేఖర్‌లను సస్పెండ్ చేసినట్లు ట్రాన్స్‌కో డివిజినల్ ఇంజినీర్ కె.గంగారాం తెలిపారు.