మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
NRML: సారంగాపూర్ మండలంలోని చించొలి(బి) గ్రామానికి చెందిన పల్లెర్ల సాయన్న (61) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, మద్యానికి బానిస కావడం కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.