VIDEO: వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి ఆందోళన

BHPL: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో సోమవారం ముమ్మడి రాకేష్ అనే యువకుడు వాటర్ ట్యాంక్ పైకి ఎక్కాడు. గోదావరి వద్ద పూజలు చేసే అర్చకుడైన రాకేష్, కొందరు పూజారుల దుర్భాషలతో మనస్తాపం చెంది, పెట్రోల్, మద్యం బాటిళ్లతో ట్యాంక్‌పైకి ఎక్కాడు. ఎస్సై తమాషారెడ్డి, స్థానిక అర్చకుడు పవన్ శర్మ నచ్చ జెప్పడంతో రాకేష్ కిందకు దిగాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.