నేడు మేడారంకు మంత్రి పొన్నం రాక
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారక్క దేవతామూర్తులను నేడు శనివారం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. వనదేవతలకు మొక్కుబడులు చెల్లించుకున్న పిదప భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్టాండ్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం మంత్రి పొన్నం మీడియాతో జాతర విశేషాలు మాట్లాడనున్నారు.